Share News

Donald Trump: గుండు కొట్టించిన వ్యక్తినే అందలమెక్కించి.. ట్రంప్ వీడియో వైరల్

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:03 PM

రెజ్లింగ్ స్టార్ కు రింగులోనే గుండు గీకిన ట్రంప్ ఆ తర్వాత తన పంతం నెగ్గించుకున్నాడు. ఇప్పుడదే కుటుంబానికి కీలక పదవులు ఇచ్చాడు.

Donald Trump: గుండు కొట్టించిన వ్యక్తినే అందలమెక్కించి.. ట్రంప్ వీడియో వైరల్
Donald Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. తాను ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత పలువురికి కీలక పదవులు ఇచ్చాడు. అందులో 76 ఏళ్ల లిండా మెక్ మాన్ కూడా ఉన్నారు. ట్రంప్‌ తనకు అత్యంత సన్నిహితురాలైన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్‌మాన్‌ పేరును విద్యాశాఖకు ప్రకటించారు. మాజీ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆమెకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు. లిండాతో పాటు ఆమె భర్త లిన్స్ మెక్ మాన్ తోనూ ట్రంప్ కు ఎప్పటినుంచో లావాదేవీలున్నాయి. 1980లో ట్రంప్ డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్ ను స్పాన్సర్ చేసిన సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఘటనను అమెరికా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధిచిన వీడియో మరోసారి వైరలవుతోంది.


జనవరి 2007లో రా ఎపిసోడ్‌లో ట్రంప్ లిండా భర్తకు గుండు కొట్టించాడు. ఆరోజు ప్రతి బిలియనీర్ వారికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక ప్రొఫెషనల్ రెజ్లర్ ను ఎంచుకున్నాడు. ట్రంప్ బాబీ లాష్లేని ఎంపిక చేసుకోగా.. మెక్ మాన్ ఉమాగాకు మద్దతు ఇచ్చాడు. ఓడిపోయిన వ్యక్తి రింగులో గుండుచేయించుకోవాలని పందెం వేసుకున్నారు. లాష్లే ట్రంప్ కు విజయాన్ని అందించడంతో మెక్ మాన్ కు ట్రంప్ దగ్గరుండి గుండుకొట్టించాడు. ట్రంప్ చలాకీతనానికి ఇదొక నిదర్శనంగా చొప్పొచ్చు.



తన భర్త విన్స్‌ మెక్‌మాన్‌తో కలిసి లిండా రెజ్లింగ్‌ కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తీసుకువచ్చారు. వీరి కంపెనీయే ప్రస్తుతం ‘డబ్ల్యూడబ్ల్యూఈ’గా పేరుగాంచింది. ఇది అమెరికా పాప్‌ సంస్కృతికి ప్రధాన కేంద్రంగా కూడా నిలిచింది. 2009లో ఆమె ఈ కంపెనీ సీఈవో పదవిని వదులుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కనెక్టికట్‌ నుంచి ఆమె 2010, 12లో సెనెట్‌కు పోటీ చేసి ఓడారు. కానీ, ఆమె రిపబ్లికన్‌ పార్టీలోనే ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ట్రంప్ కు చేదోడువాదోడుగా నిలిచారు. 2016లో ఏకంగా 6 మిలియన్‌ డాలర్లు సమకూర్చి ట్రంప్ తో తనకున్న అనుబంధాన్ని చాటారామె.

Chennai: శ్మశానంలో కళ్లు తెరిచిన వృద్ధురాలు..

Updated Date - Nov 20 , 2024 | 03:14 PM