Share News

Delhi: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. బీజేపీ జాతీయ సదస్సు ప్రారంభం నేడు

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:40 AM

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) జాతీయ సదస్సును శనివారం ప్రారంభించనుంది. వచ్చే ఎన్నికల్లో 370 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17 - 18 తేదీల్లో 11వేల మంది బీజేపీ ప్రతినిధులతో రెండ్రోజులపాటు కొనసాగనుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

Delhi: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. బీజేపీ జాతీయ సదస్సు ప్రారంభం నేడు

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) జాతీయ సదస్సును శనివారం ప్రారంభించనుంది. వచ్చే ఎన్నికల్లో 370 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17 - 18 తేదీల్లో 11వేల మంది బీజేపీ ప్రతినిధులతో రెండ్రోజులపాటు కొనసాగనుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఉదయం 9.30కి సమావేశం ప్రారంభంకానుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 18న మోదీ(Narendra Modi) ముగింపు ప్రసంగంతో సదస్సు ముగుస్తుంది. ప్రధాన కార్యదర్శులు, సెల్‌ కన్వీనర్లు, అన్ని మోర్చాల అధ్యక్షులు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జిల్లా పంచాయతీల సభ్యులను సదస్సుకు ఆహ్వానిస్తారు. జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ ఆఫీస్ బేరర్లు, బీజేపీ జిల్లాల అధ్యక్షులు, జిల్లా, లోక్‌సభ, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ కన్వీనర్లు, లోక్‌సభ విస్తరణాధికారులు, క్రమశిక్షణా కమిటీ సభ్యులు తదితరులకు రెండ్రోజులపాటు దిశానిర్దేశం చేయనున్నారు.


ఇందులో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. వీటిలో ఒకటి రాజకీయాలకు సంబంధించినది ఉండగా, మరొకటి ఆర్థిక, సామాజిక, రామమందిరానికి సంబంధించిన అంశాలకు సంబంధించినది కావచ్చు. అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ట, మహిళా రిజర్వేషన్, పేదలు, యువకులు, రైతులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చంద్రయాన్ మిషన్‌తో సహా ఇస్రో సాధించిన విజయాలు, కరోనా సంక్షోభంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సమర్థవంత నిర్ణయాలు, COVID-19 వ్యాక్సిన్, స్వదేశీ విమానం తేజస్‌తో సహా రక్షణ రంగంలో సాధించిన విజయాలు కూడా ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 08:41 AM