Drone accident : పరస్పరం ఢీకొని పిట్టల్లా రాలిన డ్రోన్లు
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:13 AM
క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఊహించని ప్రమాదం జరిగింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో డ్రోన్లు
అమెరికాలోని ఫ్లోరిడాలో పలువురికి గాయాలు
ఫ్లోరిడా, డిసెంబరు 23: క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఊహించని ప్రమాదం జరిగింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో డ్రోన్లు పరస్పరం ఒకదానికొకటి ఢీకొని ప్రదర్శన తిలకిస్తున్న వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ ఏడేళ్ల బాలుడు సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన బాలుడి ఫోటోలను అతని తల్లి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. డాక్టర్లు తన చిన్నారి గుండెకు శస్త్రచికిత్స నిర్వహించబోతునట్లు తెలిపి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డ్రోన్లు కూలిపోతున్న వీడియోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరలయింది. ఓర్లాండ్ సిటీ భాగస్వామ్యంతో స్కై ఎలిమెంట్స్ సంస్థ డ్రోన్ల ప్రదర్శనను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని వారు తెలిపారు.