Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రోజు హాఫ్ డే హాలిడే
ABN , Publish Date - Jan 18 , 2024 | 03:53 PM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు అనువుగా సెలవు మంజూరు చేసింది. ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధ్రువీకరించారు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు అనుగుణంగా సెలవు మంజూరు చేసింది. ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధ్రువీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాల గురించి మంత్రుల వద్ద ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. మంత్రుల ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని కోరారు.
22 వ తేదీ తరువాత ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజలకు అయోధ్యను ఉచితంగా చూపించాలని ప్రధాని సూచించారు. వారితో కలిసి ప్రజాప్రతినిధులు రాములోరిని దర్శించుకోవాలన్నారు. ఇండియా కూటమికి చెందిన నేతలు రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాబోమని ఇదివరకే తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామన్నారు.