ఏపీలో 22 శాతం అడవులు
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:28 AM
ఆంధ్రప్రదేశ్‌లో 22.63 శాతం, తెలంగాణలో 24.70 శాతం అడవులు ఉన్నాయని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.
కేంద్ర అటవీ శాఖ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 22.63 శాతం, తెలంగాణలో 24.70 శాతం అడవులు ఉన్నాయని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. దేశంలో గత రెండేళ్లుగా అటవీ విస్తీర్ణం, సంబంధింత ఇతర అంశాలపై ’ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు (ఐఎ్‌సఎ్‌ఫఆర్) 2023’ పేరుతో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం, ఏపీలో అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు కిలోమీటర్లుగా ఉంది. అత్యధిక సాంద్రత ఉన్న అడవి 1,995.71 చ.కి.మీ, మధ్యస్థ సాంద్రత ఉన్న అడవి 13,725.75 చ.కి.మీ, ఓపెన్ ఫారెస్ట్ 14,363.50 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. అంతేగాక పొదలు 8,351.62 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.