Share News

Jharkhand-Hemant Soren: ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 05:00 PM

భూకుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనను ఒక రోజు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Jharkhand-Hemant Soren: ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌

రాంచీ: భూకుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనను ఒక రోజు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం అరెస్టు చేశారు. హేమంత్ కస్టడీకి అప్పగించాలని, విచారించాల్సి ఉందని కోరింది. దీంతో సోరెన్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండవ రౌండ్‌ విచారణలో హేమంత్ సోరెన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించారు. సోరెన్‌‌ను కీలకమైన 15 ప్రశ్నలు అడిగారు.

Updated Date - Feb 01 , 2024 | 05:13 PM