UP: రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు.. యోగీ నాయకత్వంపై మోదీ ప్రశంసలు
ABN , Publish Date - Feb 19 , 2024 | 04:47 PM
ఉత్తరప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు "రెడ్ టేప్" నుంచి "రెడ్ కార్పెట్" అనేలా మారాయని కొనియాడారు.
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు "రెడ్ టేప్" నుంచి "రెడ్ కార్పెట్" అనేలా మారాయని కొనియాడారు. లఖ్‌నవూలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతోందన్నారు.
రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, వ్యాపార సంస్కృతి విస్తరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దేశం అభివృద్ధిక నోచుకోలేదని.. తాను విక్షిత్ భారత్ గురించి మాట్లాడితే.. ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పారు. దేశానికి కొత్త ఆలోచన, దశ అవసరమని వివరించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు పట్టం కడతారని వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి