Share News

ఇంట్లో గ్యాస్‌ లీక్‌..ముగ్గురు చిన్నారులు ఆహుతి

ABN , Publish Date - Mar 02 , 2024 | 02:18 AM

వంటగ్యాస్‌ లీకవడంతో సంభవించిన ప్రమాదంలో ఓ బాలిక, ఇద్దరు బాలురు అగ్నికి ఆహుతయ్యారు. వీరితోపాటు తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

ఇంట్లో గ్యాస్‌ లీక్‌..ముగ్గురు చిన్నారులు ఆహుతి

చెన్నై, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్‌ లీకవడంతో సంభవించిన ప్రమాదంలో ఓ బాలిక, ఇద్దరు బాలురు అగ్నికి ఆహుతయ్యారు. వీరితోపాటు తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. తమిళనాడులోని చెంగల్పట్టు పట్టణంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెంగల్పట్టు మణియక్కార వీధిలో సద్దాం, రోసీగుత్తమ్‌ (25) అనే బీహరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి రజియా పర్వీన్‌ (7) అనే కుమార్తె, సాయ్‌అలీ (4), అల్తాఫ్‌ (2) ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం రాత్రి వీరి వంటగదిలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలువైపులా మంటలు చెలరేగాయి. రోసీగుత్తమ్‌, ఆమె పిల్లలు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతుండగా రజియా, సాయ్‌ అలీ, అల్తాఫ్‌ మృతిచెందారు. రోసీగుత్తం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - Mar 02 , 2024 | 07:39 AM