Good news for pensioners: పెన్షనర్లకు ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
ABN , Publish Date - Sep 13 , 2024 | 07:29 PM
గత రెండేళ్లుగా ఇళ్లకు వెళ్లి.. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను పోస్టల్ శాఖ జారీ చేస్తుంది. ఈ ఏడాది సైతం ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆ శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని పెద్ద నగరాలతోపాటు జిల్లా కేంద్రాల్లోని పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు అందజేయనున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 : ప్రతి నెల పెన్షన్ అందుకునే పెన్షనర్లకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను వారి ఇంటి వద్దే అందివ్వాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. అందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ పేరిట డీఎల్‌సీ 3.0 ప్రచారాన్ని చేపట్టింది. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు అంటే మాసం రోజుల పాటు పెన్షనర్ల ఇంటి వద్దే.. వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందజేయాలని నిర్ణయించింది.
Also Read: Karnataka: మాండ్యలో మత ఘర్షణలపై ప్రభుత్వం సీరియస్ .. పోలీసులపై వేటు
Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం
దేశంలోని అన్ని పెద్ద నగరాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పోస్టల్ శాఖ భావిస్తుంది. ఈ అంశంపై గురువారం పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు న్యూడిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందించే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Also Read: Vijayawada Floods: మరో సారి స్పందించిన బుద్దా వెంకన్న
Also Read: YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు
అందుకోసం బ్యానర్లు, సోషల్ మీడియా, ఎస్ఎమ్ఎస్, షార్ట్ వీడియోల ద్వారా పెన్షనర్లకు చేరేలా ప్రచారం నిర్వహించాలన్నారు. అందుకు సంబంధించిన సాంకేతిక సహాయత ఉడయ్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందిస్తుందని తెలిపారు. గతేడాది అంటే.. 2023లో సైతం పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 2.0 పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు.
Also Read: AP Rains: వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఐటీడీపీ
Also Read: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాటి ఈడీ సమన్లు నుంచి నేటి బెయిల్ వరకు..
ఈ సందర్భంగా దేశంలోని 100 నగరాల్లో 1.45 కోట్ల మంది పెన్షనర్లు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందించినట్లు పోస్టల్ శాఖ ఈ సందర్భంగా వివరించింది. పెన్షనర్లలో డిజిటల్ ఎంపావర్మెంట్ పెంపొందించడంతో పాటు జీవన సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగు పరచడం కోసం ఈ తరహా విధానాన్ని తీసుకు వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read More National News and Latest Telugu New