Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’
ABN , Publish Date - Aug 08 , 2024 | 07:03 AM
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినేశ్ పొగాట్ స్పష్టం చేశారు. ఇంకా వినేశ్ ఏమన్నారంటే.. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నాకు ఇకపై పోరాడే బలం లేదు. నన్ను క్షమించండి అంటూ వినేశ్ ఫొగట్ ముగించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినేశ్ పొగాట్ స్పష్టం చేశారు. ఇంకా వినేశ్ ఏమన్నారంటే.. ‘మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నాకు ఇకపై పోరాడే బలం లేదు. నన్ను క్షమించండి. గుడ్ బై రెజ్లింగ్ 2001 - 2024’ అని వినేశ్ ఫొగట్ ముగించారు. 50 కిలోల మహిళా విభాగంలో.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహాకులు అనర్హత వేటు వేశారు.
సీఏఎస్‌ను ఆశ్రయించి.. అంతలోనే కీలక నిర్ణయం
మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్టు ఆఫ్ అర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆమె ఆశ్రయించారు. తాను రజిత పతకానికి అర్హురాలినని ఆమె... తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ దీనిపై స్పందించనుంది. అంతలోనే వినేశ్ ఫొగట్.. క్రీడల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మూడు ఒలింపిక్స్.. మూడు కేటగిరీలు..
29 ఏళ్ల భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ స్వస్థలం హరియాణ. ఆమె మూడు ఒలింపిక్స్‌లో.. మూడు కేటగిరీలలో పాల్గొన్నారు. 2016లో రియో ఒలింపిక్స్‌లో 48 కిలోల మహిళ కేటగిరీలో వినేశ్ పాల్గొన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 53 కిలోల మహిళా విభాగంలో వినేశ్ ఫొగట్ పాల్గొన్నారు. ఇక తాజాగా పారిస్‌లో జరుగుతున్న 50 కేజీల కేటగిరీలో ఆమె పాల్గొన్నారు. అయితే కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నారనే కారణంగా ఆమెపై ఒలింపిక్స్ నిర్వహకులు అనర్హత వేటు వేశారు.
తొలి భారతీయురాలిగా రికార్డు...
ఇక 2014, 2018, 2022లలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలను వినేశ్ ఫొగట్ గెలుచుకున్నారు. అదీ కూడా వివిధ కేటగిరీలలో కావడం గమనార్హం. అలాగే 2018లో జరిగిన అటు ఆసియా గేమ్స్‌తోపాటు ఇటు కామెన్వెల్స్ గేమ్స్‌లో సైతం బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా వినేశ్ చరిత్ర సృష్టించారు. అదే విధంగా 2019, 2022లలో నిర్వహించిన ప్రపంచ రెజ్లర్ చాంపియన్ షిప్ పోటీల్లో రెండు కంచు పతకాలను ఆమె సాధించారు.
Read More National News and Latest Telugu News