Share News

Google Maps: కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. నమ్ముకుంటే నేరుగా నదిలోకి

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:43 PM

గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది.

Google Maps: కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. నమ్ముకుంటే నేరుగా నదిలోకి

కాసరగోడ్: గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది. కాసర్‌గోడ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకున్న ఇద్దరు యువకులు కారుతోసహా నేరుగా వాగులోకి దూసుకెళ్లారు.

అయితే వారి వాహనం నదిలోకి వెళ్లకుండా చెట్టు అడ్డుపడటంతో సురక్షితంగా బయటపడ్డారు. బాధితులలో ఒకరైన అబ్దుల్ రషీద్.. గూగుల్ మ్యాప్ తప్పుగా చూపడంతోనే తాను కారుని నదిలోకి తీసికెళ్లినట్లు చెప్పాడు. తమకిది పునర్జన్మే అని భావోద్వేగానికి లోనయ్యాడు.


మే నెలలో..

ఇలాంటి ఘటనే మే నెలలోనూ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఎస్‌యూవీ (ఫోర్డ్‌ ఎండీవర్‌)లో కేరళ టూర్‌ వెళ్లారు.ఇడుక్కి నుంచి అలప్పుజకు బయలుదేరారు. మార్గం తెలియకపోవడంతో గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా వాహనం నడుపుతున్నారు.

రాత్రివేళ కావడం, వర్షం పడుతుండటంతో దారి కనిపించడం కష్టంగా ఉంది. కురప్పంతర ప్రాంతానికి చేరుకోగానే గూగుల్‌ మ్యాప్స్‌ రోడ్డు వైపు కాకుండా కాలువ వైపు వెళ్లాలని సూచించింది. వర్షం పడుతుండడంతో రోడ్డుపై నీరు నిలిచి ఉండవచ్చని భావించి కారు నడుపుతున్న వ్యక్తి మ్యాప్స్‌లో సూచించిన వైపు పోనిచ్చాడు.


దాంతో కారు కాలువలోకి వెళ్లిపోయింది. అక్కడ లోతుగా ఉండడంతో కారు అద్దాల నుంచి బయటకొచ్చిన వారిని, స్థానికులు గమనించి కాపాడారు.

కారు నీటిలో 150మీటర్లు మేర కొట్టుకుపోయింది. పోలీసులు, స్థానికులు కలిసి కారును బయటకు తీశారు. సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై సామాన్య పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 04:44 PM