Share News

Madhya Pradesh: మద్యం ఫ్యాక్టరీపై దాడి.. వెలుగులోకి ఆసక్తికర సంఘటన

ABN , Publish Date - Jun 16 , 2024 | 08:14 PM

మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో సమ్ మద్యం ఫ్యాక్టరీపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆప్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఆకస్మిక దాడి చేసింది. ఆ ఫ్యాక్టరీలో 60 మందికిపైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 20 మంది బాలికలు ఉన్నారు. వీరంతా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నట్లు కమిషన్ ఈ సందర్భంగా గుర్తించింది.

Madhya Pradesh: మద్యం ఫ్యాక్టరీపై దాడి.. వెలుగులోకి ఆసక్తికర సంఘటన

రైసన్, జూన్ 16: మధ్యప్రదేశ్‌లోని రైసన్ జిల్లాలో సమ్ మద్యం ఫ్యాక్టరీపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆప్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) ఆకస్మిక దాడి చేసింది. ఆ ఫ్యాక్టరీలో 60 మందికిపైగా బాల కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 20 మంది బాలికలు ఉన్నారు. వీరంతా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నట్లు కమిషన్ ఈ సందర్భంగా గుర్తించింది.

Also Read: Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ

మద్యం ఫ్యాక్టరీలో రసాయనాల వినియోగం కారణంగా బాలల చేతులు తీవ్ర గాయాలతో నిండి ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో పేర్కొన్నారు. ఇది బాల కార్మికుల కేసుతోపాటు మనుష్యుల అక్రమ రవాణ కిందకి వస్తుందని తెలిపారు. స్థానిక అధికారుల కుమ్మక్కుతోనే ఇదంతా జరుగుతుందని తెలిపారు.

Also Read: Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’


ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఈ ఘటనతో సంబంధమున్న వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ క్రమంలో జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులను సస్పెన్షన్ చేశారు. ఇక బాల కార్మికుల చట్టం 374 ప్రకారం.. 75, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ఈ మద్యం ప్యాక్టరీపై ఈ రోజే చర్యలు తీసుకున్నామని ఏసీపీ కమలేశ్ కుమార్ వెల్లడించారు.

Also Read: Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్


Also Read: Delhi water crisis: నీటి కుళాయి వద్ద ఘర్షణ: ముగ్గురికి గాయాలు

అలాగే సేట్‌మెంట్ సైతం రికార్డు చేశామన్నారు. దర్యాప్తును వేగవంతం చేశామని చెప్పారు. అదీకాక బాల కార్మికులను తరలించేందుకు ఎవరికీ సందేహం కలగకుండా.. స్కూల్ బస్సు వినియోగిస్తున్నట్లు తమ విచారణలో లేదందని తెలిపారు. ఇక ఈ ఘటనపై అధికార బీజేపీ నేతలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం మోహన్ యాదవ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. పిల్లల చేతిలో నోటు పుస్తకాలు ఉండాలి కానీ.. మద్యం సీసాలు ఏమిటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో అవినీతికి, అలసత్వానికి ఇది పరాకాష్ట అని మండిపడింది. మద్యం ప్యాక్టరీలో బాల కార్మికులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్‌సీపీసీఆర్ ఆకస్మిక దాడి చేసింది.

Also Read: Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 08:19 PM