Share News

హరియాణా మాజీ సీఎం చౌతాలా కన్నుమూత

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:50 AM

హరియాణా మాజీ సీఎం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా(89) కన్నుమూశారు.

హరియాణా మాజీ సీఎం చౌతాలా కన్నుమూత

చంఢీగఢ్‌, డిసెంబరు 20: హరియాణా మాజీ సీఎం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా(89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని నివాసంలోనే ఆయన గుండెపోటుతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. మాజీ ఉప ప్రధాన మంత్రి దేవీ లాల్‌ పెద్ద కొడుకైన చౌతాలా అయిదు సార్లు హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చౌతాలా మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చౌతాలా మృతి నేపథ్యంలో హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవు ప్రకటించింది. అలాగే శుక్రవారం నుంచి మూడురోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో 2013 నుంచి 2021 జూలై వరకు చౌతాలా జైలు శిక్ష అనుభవించారు.

Updated Date - Dec 21 , 2024 | 03:50 AM