Share News

Hospitals: ఇవాళ ఆరోగ్య సేవల బంద్.. కారణమిదే

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:40 AM

డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయాలని హరియాణా వైద్యులు నిర్ణయించారు. ఇవాళ(జూలై 25న) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవల బంద్‌కు హర్యానా సివిల్ మెడికల్ సర్వీసెస్ (HCMS) అసోసియేషన్ బుధవారం పిలుపునిచ్చింది.

Hospitals: ఇవాళ ఆరోగ్య సేవల బంద్.. కారణమిదే

చండీగఢ్: డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయాలని హరియాణా వైద్యులు నిర్ణయించారు. ఇవాళ(జూలై 25న) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవల బంద్‌కు హర్యానా సివిల్ మెడికల్ సర్వీసెస్ (HCMS) అసోసియేషన్ బుధవారం పిలుపునిచ్చింది.

హెచ్‌సీఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ ఖ్యాలియా సహా నలుగురు వైద్యులు పంచకులలోని డైరెక్టర్ జనరల్, హెల్త్ సర్వీసెస్ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. స్పెషలిస్ట్ కేడర్ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా ఉండేలా కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ల (SMO) ప్రత్యక్ష నియామకం, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు బాండ్ మొత్తాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి.


"గత కొన్ని నెలలుగా ప్రభుత్వం మాకు పలు హామీలు ఇచ్చింది. కానీ అవి నెరవేర్చలేదు. దీంతో ఇవాళ OPD, అత్యవసర, పోస్ట్‌మార్టంతో సహా మొదలైన ఆరోగ్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ విషయంపై ప్రభుత్వానికి నెల కిందటే సమాచారం ఇచ్చాం. గురువారం ప్రభుత్వం మాకు చర్చలకు రమ్మని ఆహ్వానం తెలిపింది. చర్చలు సఫలీకృతం కాకపోతే సమ్మె నిరవధికంగా కొనసాగుతుంది"అని ఖ్యాలియా తెలిపారు. కాగా.. సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో తెలపాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కమల్ గుప్తా అధికారులకు సూచించారు. సమస్యల్ని పరిష్కరిస్తామని వైద్యులకు హామీ ఇచ్చారు. "సమస్యలపై చర్చించడానికి సీఎం, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించాం.


వైద్యుల డిమాండ్ల ప్రాధాన్యతను గుర్తించాం. అందరికీ సంతృప్తికరంగా ఉండేలా ఒక తీర్మానాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. వైద్యులు సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నయంగా ఇతరులతో ఆసుపత్రులను నడిపిస్తాం" అని కమల్ చెప్పారు. డిమాండ్ల సాధన కోసం జులై 15న ప్రభుత్వ వైద్యులు రెండు గంటల పాటు సమ్మె చేశారు.

సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీడీ) సేవలపై ప్రభావం పడింది.HCMS అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి వైద్యులు ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున రెండు బాండ్‌లను సమర్పించాలి. ఈ నగదు చాలా ఎక్కువ కావడంతో కోర్సుల్లో ప్రవేశించడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితోపాటు పలు డిమాండ్లను ప్రభుత్వ వైద్యులు లేవనెత్తుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 25 , 2024 | 07:41 AM