Hathras Stampede: భోలే బాబా అరెస్ట్‌పై పోలీసుల సంచలన ప్రకటన..!
ABN , Publish Date - Jul 04 , 2024 | 05:52 PM
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌లో మాజీ పోలీసు కానిస్టేబుల్ సూరజ్ పాల్ (Suraj paul) ప్రవచనాలు బోధిస్తూ భోలే బాబాగా పేర్గాంచారు. సత్సంగ్ ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దాదాపు 2,50,000 మంది హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. భోలే బాబా నడుచుకుంటూ వెళ్లిన ప్రదేశంలో మట్టిని తీసుకునేందుకు భక్తులు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశామని వీరంతా సత్సంగ్‌లో వాలంటీర్లుగా పనిచేశారని అలీఘర్ రేంజ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు.
Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన
లక్ష రివార్డు
హత్రాస్ ఘటనలో కీలక నిందితుడ దేవప్రకాష్ మధుకర్‌పై నాన్-బెయిల్‌బుల్ వారెంట్ జారీచేయబడుతుందని.. అతడిపై లక్ష రూపాయిల రివార్డు ప్రకటించనున్నట్లు ఐజీ శలభ్ మాథుర్ వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన అందరిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం హత్రాస్ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని.. విచారణలో తేలిన అంశాల ఆధారంగా తదుపరి అరెస్ట్‌లు ఉంటాయన్నారు. అవసరమైతే భోలే బాబాను విచారిస్తామన్నారు. ఆయన పాత్ర ఉందో లేదో విచారణలో తేలుతుందన్నారు. ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు లేదన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆర్గనైజింగ్ కమిటీ అనుమతి తీసుకుందన్నారు.
Hero Vijay: నీట్ వద్దు.. వ్యతిరేక తీర్మానానికి సంపూర్ణ మద్దతు
బాబా అరెస్ట్‌కు డిమాండ్..
ప్రమాద స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ బుధవారం సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. కార్యక్రమం నిర్వహణ కోసం ఎవరు అనుమతి తీసుకున్నారో వారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని.. ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని ఆదిత్యనాథ్ తెలిపారు. హత్రాస్ తొక్కిసలాటలో మృతులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ తెలిపారు.
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News