Share News

Hathras stampede: హత్రాస్ తొక్కిసలాట.. పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:55 AM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌(Hathras Stampede) జిల్లాలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో 121 మృతికి కారణమైన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేశ్ ప్రకాశ్ నిర్వాహకుడిగా ఉన్నాడు. తొక్కిసలాట జరిగిన అనంతరం అతను పారిపోయాడు.

Hathras stampede: హత్రాస్ తొక్కిసలాట.. పోలీసులకు లొంగిపోయిన ప్రధాన నిందితుడు

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌(Hathras Stampede) జిల్లాలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో 121 మృతికి కారణమైన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేశ్ ప్రకాశ్ నిర్వాహకుడిగా ఉన్నాడు.

తొక్కిసలాట జరిగిన అనంతరం అతను పారిపోయాడు. తప్పించుకు తిరుగుతూ చివరికి ఢిల్లీలో యూపీ ఎస్టీఎప్ అధికారుల ముందు లొంగిపోయాడు. తరువాత అతడ్ని యూపీ పోలీసులకు అప్పగించారు.


"హత్రాస్ సత్సంగ్‌కి దేవ్‌ప్రకాశ్ ప్రధాన నిర్వాహకుడిగా ఉన్నాడు. మధుకర్ ఏ నేరం చేయలేదు. అందుకే పోలీసుల ముందు లొంగిపోయాడు. అతనికి హృదయ సంబంధిత వ్యాధులున్నాయి. దేవ్ ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. అందుకే విచారణ నిమిత్తం లొంగిపోయాడు. ముందస్తు బెయిల్​ కోసం మేం కోర్టుకి వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం" అని భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ అన్నారు.

అయితే నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా ఈ ఘటనపై విచారించేందుకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. 100 మందికిపైగా వాంగ్మూలలను నమోదు చేసింది. ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మధుకర్‌ని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Bole Baba: తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే


For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 11:00 AM