Share News

Jharkhand: భూకుంభకోణం కేసు.. ఈడీ ముందు హాజరైన హేమంత్ సోరెన్

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:14 PM

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) శనివారం ఈడీ(ED) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరెన్ అభిమానులు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Jharkhand: భూకుంభకోణం కేసు.. ఈడీ ముందు హాజరైన హేమంత్ సోరెన్

రాంచీ: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) శనివారం ఈడీ(ED) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరెన్ అభిమానులు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈడీ అధికారులను సోరెన్ ఇంటికి రానివ్వబోమని పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

నిరసనల దృష్ట్యా అధికారులు రాంచీలోని ముఖ్యమంత్రి ఇల్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జోనల్ కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు. జనవరి 16 - 20 మధ్య ఈ కేసు విచారణకు అందుబాటులో ఉండాలని సోరెన్‌ను కోరుతూ దర్యాప్తు సంస్థ ఈ నెల13న లేఖ పంపింది. గతంలో ఏడుసార్లు ఆయన సమన్లను దాటవేశారు. ఈ క్రమంలో ఇవాళ విచారణకు అంగీకరించగా ఈడీ అధికారులు ఆయన నివాసానికి వచ్చి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

Updated Date - Jan 20 , 2024 | 03:15 PM