Share News

Jharkhand CM : ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ ప్రమాణం

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:13 AM

ఝార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రైండ్‌లో ‘ఇండియా’ కూటమి నేతల సమక్షంలో గురువారం ఈ

Jharkhand CM : ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ ప్రమాణం

నాలుగోసారి బాధ్యతల స్వీకరణ

హాజరైన ఇండియా కూటమి నేతలు

రాంచీ, నవంబరు 28: ఝార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రైండ్‌లో ‘ఇండియా’ కూటమి నేతల సమక్షంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. సోరెన్‌తో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాంచీ పట్టణంలో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఝార్ఖండ్‌ సీఎంగా సోరెన్‌ బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగోసారి. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమి ఘన విజయం(జేఎంఎం 34, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ 2 సీట్లు) సాధించిన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 29 , 2024 | 05:13 AM