Share News

RG Kar Medical College Student: కుమార్తె చనిపోయే ముందు డైరీలో ఏం రాసిందంటే..

ABN , Publish Date - Aug 15 , 2024 | 06:24 PM

ఆగస్ట్ 8వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఆ విద్యార్థి విధులకు హాజరయ్యే ముందు తన డైరీలో ఏం రాసుకుందో ఆమె కన్నతండ్రి గురువారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో వివరించారు. వైద్య వృత్తిలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అంకితభావంతో సాధించాలని స్పష్టం చేసిందన్నారు.

RG Kar Medical College Student: కుమార్తె చనిపోయే ముందు డైరీలో ఏం రాసిందంటే..

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిలో అసంతృప్తి రాజుకుంది. దీంతో వారంత నిరవధిక ఆందోళన బాట పట్టారు. సదరు వైద్య విద్యార్థిని ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున హత్యాచారానికి గురైంది.

Also Read: Jammu Kashmir Assembly Elections: డీజీపీగా నళిన్ ప్రభాత్


అయితే అంతకు ముందు రోజు రాత్రి. అంటే ఆగస్ట్ 8వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఆ విద్యార్థి విధులకు హాజరయ్యే ముందు తన డైరీలో ఏం రాసుకుందో ఆమె కన్నతండ్రి గురువారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో వివరించారు. వైద్య వృత్తిలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అంకితభావంతో సాధించాలని స్పష్టం చేసిందన్నారు. అంటే ఎండీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించడం ద్వారా గోల్డ్ మెడల్ అందుకోవాలని ఆమె ఆకాంక్షించిందని ఈ సందర్భంగా ఆమె కన్నతండ్రి పేర్కొన్నారు. ఈ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోకుండానే తన కుమార్తె తిరిగి రానీ లోకాలకు వెళ్లిపోయిందంటూ ఆ కన్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె బాగా కష్టపడి చదివే విద్యార్థి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read: Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?


ఆమె తన లక్ష్యం కోసం వైద్యురాలుగా ఎదిగే క్రమంలో తమ కుటుంబం చాలా త్యాగాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. 31 ఏళ్ల తన కుమార్తె దారుణంగా హత్యకావింప పడిందని ఆయన కన్నీటి పర్యంతమవుతు తెలిపారు. అయితే ఈ హత్య కేసులో తమకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే నిందితులకు సైతం కఠిన శిక్ష పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తొలుత తమ కుటుంబానికి సమాచారం అందిందన్నారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి.. ఆ తర్వాత లైంగిక దాడి చేశారన్న నిజం తెలిసిందని చెప్పారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..


గత గురువారం రాత్రి ఆసుపత్రిలో విధులకు ఆమె హాజరు అయింది. ఆగస్ట్ 9 తేదీ తెల్లవారుజామున ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లింది. ఆ సమయంలో అంటే.. తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 5. 00 గంటల మధ్య ఆమెపై పలువురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆమెకు నిర్వహించిన పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టమైంది. అలాగే ఆమె నోటి భాగం, కళ్లు, ప్రైవేట్ భాగాల్లో గాయాలు సైతం ఉన్నాయనే పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టమైంది. మరోవైవు ఈ కేసును సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అప్పగించిన విషయం విధితమే.ఈ ఘటనతో కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 15 , 2024 | 06:25 PM