Share News

58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు అనుమతి ఎలా?

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:06 AM

ప్రముఖ పంజాబీ గాయకుడు, దివంగత సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు బాల్‌కౌర్‌ సింగ్‌, చరణ్‌ కౌర్‌ ఐవీఎఫ్‌ (ఇన్‌-విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన అంశం వివాదానికి కారణమవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం చరణ్‌కౌర్‌ వయస్సు 58 సంవత్సరాలు, బాల్‌కౌర్‌ సింగ్‌కు 60 ఏళ్లు. దీంతో వీరు చిక్కుల్లో పడ్డారు.

58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు అనుమతి ఎలా?

సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులకు చిక్కులు

న్యూఢిల్లీ, మార్చి 20: ప్రముఖ పంజాబీ గాయకుడు, దివంగత సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు బాల్‌కౌర్‌ సింగ్‌, చరణ్‌ కౌర్‌ ఐవీఎఫ్‌ (ఇన్‌-విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన అంశం వివాదానికి కారణమవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం చరణ్‌కౌర్‌ వయస్సు 58 సంవత్సరాలు, బాల్‌కౌర్‌ సింగ్‌కు 60 ఏళ్లు. దీంతో వీరు చిక్కుల్లో పడ్డారు. నిబంధనల ప్రకారం ఐవీఎఫ్‌ పద్ధతిలో బిడ్డను కనడానికి అనుమతించే వయస్సు 21 నుంచి 50 ఏళ్లు మాత్రమే. కానీ, మూసేవాలా తల్లి చరణ్‌ కౌర్‌ను 58 ఏళ్ల వయసులో ఈ విధానానికి ఎలా అనుమతించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంజాబ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చరణ్‌ కౌర్‌ ఐవీఎఫ్‌ చికిత్స ద్వారా గర్భం దాల్చిన విషయం ఇటీవల ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ద్వారా తమ దృష్టికి వచ్చిందని, ఈ చికిత్సకు సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరుతూ ఈ నెల 14న పంజాబ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని ఆప్‌ నేతృత్వంలోని భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం బుధవారం ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించింది. ‘సీఎం భగవంత్‌ మాన్‌ పంజాబీల గౌరవాన్ని, మనోభావాలను ఎల్లప్పుడూ గౌరవిస్తారు. బాల్‌కౌర్‌ దంపతుల ఐవీఎఫ్‌ చికిత్సకు సంబంధించిన పత్రాలను అడుగుతోంది కేంద్ర ప్రభుత్వమే.. మేం కాదు’ అని ట్వీట్‌ చేసింది. కాగా, బాల్‌కౌర్‌ సింగ్‌, చరణ్‌కౌర్‌ దంపతులకు సిద్దూ మూసేవాలా ఒక్కడే సంతానం. గాయకుడు, కాంగ్రెస్‌ నేత అయిన సిద్దూను 2022 మే 29న దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

Updated Date - Mar 21 , 2024 | 06:06 AM