Khalistani Terrorists Killed : యూపీలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల హతం
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:49 AM
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో సోమవారం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పంజాబ్‌లోని గురుదా్‌సపూర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గ్రెనేడ్‌లో దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
పిలిభిత్/చండీగఢ్, డిసెంబరు 23: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో సోమవారం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పంజాబ్‌లోని గురుదా్‌సపూర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న గ్రెనేడ్‌లో దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పిలిభిత్‌లోని పురానాపుర్ ఏరియాలో ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజెడ్‌ఎఫ్) ఉగ్రవాదులకు, పంజాబ్-ఉత్తరప్రదేశ్ ఉమ్మడి భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. మృతిచెందిన ఖలిస్థానీ ఉగ్రవాదులను వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), గుర్విందర్ సింగ్ (25), జషన్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ టెర్రర్ మాడ్యూల్‌ను కేజెడ్‌ఎఫ్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా నియంత్రిస్తున్నారని, గ్రీస్ నుంచి జస్విందర్ సింగ్, యూకే నుంచి జగ్జీత్ సింగ్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్ర సంబంధాలను మరింత వెలికి తీసేందుకు దర్యాప్తు జరుగుతోందని, రికవరీలు, అరెస్టులు ఉంటాయని తెలిపారు. కాగా, ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు పంజాబ్‌లోని గురుదా్‌సపూర్ జిల్లా కలనౌర్ తాలూకా పరిధిలోకి వారని తెలిపారు.