Share News

సైనిక దుస్తుల అక్రమ విక్రయం.. వ్యక్తి అరెస్ట్‌

ABN , Publish Date - Feb 05 , 2024 | 06:35 AM

యుద్ధ క్షేత్రంలో సైన్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫాంను పోలిన దుస్తులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా కార్యకలాపాలను దక్షిణ కమాండ్‌ మిలటరీ నిఘా విభాగం, పోలీసులు

సైనిక దుస్తుల అక్రమ విక్రయం.. వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి4: యుద్ధ క్షేత్రంలో సైన్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫాంను పోలిన దుస్తులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా కార్యకలాపాలను దక్షిణ కమాండ్‌ మిలటరీ నిఘా విభాగం, పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్‌లో తనిఖీలు చేపట్టి నాసిక్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి కేసు పెట్టారు. ఎలాంటి అనుమతుల్లేకుండా విక్రయిస్తున్నట్లు అతను తెలిపాడు. అతని నుంచి 40 దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌, ఢిల్లీలోని కొందరు వ్యక్తులకు ఈ ముఠాతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. వీరంతా బహిరంగ మార్కెట్‌లో పెద్దఎత్తున విక్రయాలకు సిద్ధమవుతున్నట్లు విచారణలో తేలింది. సైన్యం కోసం 2022 జనవరి 15న కొత్త యూనిఫాంను డిజిటల్‌ ఫార్మాట్‌లో రూపొందించారు.

Updated Date - Feb 05 , 2024 | 06:35 AM