Share News

By Poll: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ‘పరీక్ష’

ABN , Publish Date - Jul 08 , 2024 | 07:26 PM

మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో ఆయన రెండు కెబినెట్లలలో పని చేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. అందులో పలువురు కీలక నేతలున్నారు.

By Poll: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ‘పరీక్ష’
Hamirpur MP Anurag Thakur

సిమ్లా, జులై 08: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో ఆయన రెండు కెబినెట్లలలో పని చేసిన వారికి ఈ సారి మంత్రి పదవులు దక్కలేదు. అందులో పలువురు కీలక నేతలున్నారు. ఆ జాబితాలో బీజేపీ యువ నాయకుడు, హిమాచల్‌ప్రదేశ్ నేత అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. హమీర్‌పూర్ ఎంపీగా ఆయన గెలుపొందిన.. మంత్రి పదవి కేటాయించకపోవడంపై తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకే కేబినెట్‌లోకి తీసుకో లేదనే ఓ చర్చ అయితే ప్రస్తుతం ఆయన అనుచరుల్లో కొనసాగుతుంది.

Also Read: CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !


ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ మూడు స్థానాల్లోని రెండు.. హమీర్‌పూర్, డెహ్ర ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ఇక నలాగడ్ మాత్రం సిమ్లా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ యా నియోజకవర్గాల్లో అనురాగ్ సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఉప ఎన్నికల ప్రచార పర్వం.. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు పూర్తయింది. ఈ ఉప ఎన్నిక జులై 10న జరగనుంది. జులై 13న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం

Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు


మరోవైపు ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేట్టింది. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 68 స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీకి 2022, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు, ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి.. అధికారంలోకి తీసుకు వచ్చేందుకే అనురాగ్ ఠాకూర్‌కు కాషాయం దళ అగ్రనేతలు మంత్రి పదవి కేటాయించ లేదని స్పష్టమవుతుంది.

Also Read: Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?

Read Latest News And National News

Updated Date - Jul 08 , 2024 | 07:26 PM