Share News

Delhi: రూ.40 వేల కోట్లు.. 550 అమృత్ స్టేషన్లకు.. ప్రధాని మోదీ శంకుస్థాపన ఎప్పుడంటే

ABN , Publish Date - Feb 21 , 2024 | 05:06 PM

దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించడానికి నడుం బిగించిన మోదీ(PM Modi) సర్కార్ అందుకు తగినట్లుగా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన సర్కార్ ఇప్పుడు ఆయా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనులను వేగవంతం చేయబోతోంది.

Delhi: రూ.40 వేల కోట్లు.. 550 అమృత్ స్టేషన్లకు.. ప్రధాని మోదీ శంకుస్థాపన ఎప్పుడంటే

ఢిల్లీ: దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించడానికి నడుం బిగించిన మోదీ(PM Modi) సర్కార్ అందుకు తగినట్లుగా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన సర్కార్ ఇప్పుడు ఆయా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనులను వేగవంతం చేయబోతోంది.

రూ.40 వేల కోట్లతో రూఫ్‌టాప్ ప్లాజాలు, సిటీ సెంటర్‌లను అభివృద్ధి చేయడం ద్వారా రైల్వే స్టేషన్‌లలో సౌకర్యాలను మెరుగుపరచడానికి 550 అమృత్ భారత్ స్టేషన్‌లకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేయనున్నారు . ఇందులో దాదాపు 2 వేల స్టేషన్లలో 1,500 ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా "2047 - విక్షిత్ భారత్ కి రైల్వే" థీమ్‌పై దేశవ్యాప్తంగా 4 వేల పాఠశాలల్లో ప్రసంగం, వ్యాసం, కవితల పోటీలు నిర్వహిస్తారు.


ఇందులో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని.. డివిజనల్ రైల్వే మేనేజర్లు, సీనియర్ రైల్వే అధికారులు 50 వేల మంది విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారన్నారు. భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించారు.

స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్/ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వైఫై తదితర సౌకర్యాలను మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్లు రూపొందించడం, వాటిని అమలు చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జోనల్ రైల్వేలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇప్పటివరకు 1,318 స్టేషన్లను ఎంపిక చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 05:07 PM