Delhi: లింగ సమానత్వంలో దిగజారిన భారత్.. ఎన్నో స్థానంలో ఉందంటే?
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:24 PM
లింగ సమానత్వంలో(Global Gender Gap index) భారత్ రెండు స్థానాలకు దిగజారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఐస్‌లాండ్ గతం మాదిరిగానే అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. భారత్ 129వ స్థానానికి చేరుకుంది.
ఢిల్లీ: లింగ సమానత్వంలో(Global Gender Gap index) భారత్ రెండు స్థానాలకు దిగజారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఐస్‌లాండ్ గతం మాదిరిగానే అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. భారత్ 129వ స్థానానికి చేరుకుంది. దక్షిణాసియాలో, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారత్ ఐదవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. 146 దేశాల పరిస్థితిని పరిశీలిస్తే.. సూడాన్ చివరి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ మూడు స్థానాలు దిగజారి 145వ స్థానానికి పడిపోయింది.
బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్తాన్, మొరాకోలతో పాటు అత్యల్ప స్థాయి ఆర్థిక సమానత్వం కలిగిన ఆర్థిక వ్యవస్థలలో భారత్ కూడా ఉంది. ఈ దేశాలన్ని అంచనా వేసిన ఆదాయంలో 30 శాతం కంటే తక్కువ లింగ సమానత్వాన్ని నమోదు చేశారు.