Share News

జమైకాలో యూపీఐ చెల్లింపులకి భారత్‌ సిద్ధం

ABN , Publish Date - Oct 02 , 2024 | 05:22 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జమైకా ప్రధానమంత్రి ఆండ్రివ్‌ హాల్నె్‌సల మధ్య జరిగిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

జమైకాలో యూపీఐ చెల్లింపులకి భారత్‌ సిద్ధం

న్యూఢిల్లీ, అక్టోబరు 1: భారత ప్రధాని నరేంద్ర మోదీ, జమైకా ప్రధానమంత్రి ఆండ్రివ్‌ హాల్నె్‌సల మధ్య జరిగిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. యూపీఐ చెల్లింపుల విధానాన్ని జమైకాలో ప్రారంభించేందుకు భారత్‌ అంగీకరించింది. రక్షణ, ఇంధన, విద్య, వైద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర అంశాల్లో సహకారం అందించేందుకు భారత్‌ అంగీకారాన్ని తెలిపింది. జమైకా సైనికులకి శిక్షణ, ఆ దేశ రక్షణ వ్యవస్ధ ఆధునీకరణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సహకారానికి చిహ్నంగా ‘జమైకా మార్గ్‌’ రోడ్డును హాల్నెస్‌ ప్రారంభించారు.

Updated Date - Oct 02 , 2024 | 05:22 AM