India: ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు ఎవరికీ మంచిది కాదు.. భారత్ హితవు
ABN , Publish Date - Oct 26 , 2024 | 08:31 PM
ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది.
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వం ఎవరికీ మంచిది కాదని హితవు పలికింది. చర్చలు, దౌత్యమార్గాలను అనసరించాలని కోరింది. పశ్చిమాసియాలో శాంతి, సుస్ధిరతకు పిలుపునిచ్చింది.
Maharshta Elections: పోటీలో లేని ఆప్... 'ఇండియా' కూటమి అభ్యర్థులకు కేజ్రీవాల్ ప్రచారం
''శత్రుత్వాన్ని కొనసాగించడం వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదు. బందీలుగా పట్టుబడిన అమాయకులు, సాధారణ పౌరుల కడగండ్లు కొనసాగుతూనే ఉంటాయి. మా దౌత్య కార్యాలయాలు ఎప్పటికిప్పుడు అక్కడి భారత పౌరులతో సంప్రదింపులు సాగిస్తోంది" అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు సైనికులు మృతిచెందినట్టు ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఐడీఎఫ్ దాడుల కారణంగా తమకు నష్టం స్పల్పస్థాయిలోనే ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ చర్యపై స్పందించే విషయంలో తాము తొందరపడమని, అలాగని చూస్తూ ఊరుకోమని ఇరాన్ ఎంపీ ఒకరు తెలిపారు. తమను తాము రక్షించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుందని, స్పందన కూడా అదే తరహాలోనే ఉంటుందని చెప్పారు. మరోవైపు, ఇరాన్ దాడులకు ప్రతిదాడులు చేశామని, మళ్లీ దాడులు చేస్తే భారీ మూల్యం తప్పదని కూడా ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..
Read More National News and Latest Telugu News