కోల్‌కతా జూనియర్ డాక్టర్లకు ఐఎంఏ మద్దతు
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:33 AM
కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లకు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు14: కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లకు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ (ఐఎంఏ) మద్దతు ప్రకటించింది. కోల్‌కతా ఆర్ జి కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా అక్కడ జూనియర్ డాక్టర్లు గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చే స్తున ్న సంగతి తె లిసిందే. ‘కోల్‌కతా జూనియర్ డాక్టర్లకు సంఘీభావంగా మంగళవారం దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూనియర్ డాక్టర్లందరూ నిరాహార దీక్ష చేయాలి’, అని ఐఎంఏ పిలుపునిచ్చింది.