Share News

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న చిత్రాలకు చెక్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:14 AM

సోషల్‌ మీడియాలో యువతుల నగ్న ఫొటోలు షేర్‌ చేస్తామని బెదిరించడం.. ఆపై వారిని లైంగికంగా వేధించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి చర్యలకు చెక్‌ పెట్టే విధంగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న చిత్రాలకు చెక్‌

- కొత్తగా బ్లర్‌ ఫీచర్‌

లండన్‌, ఏప్రిల్‌ 11: సోషల్‌ మీడియాలో యువతుల నగ్న ఫొటోలు షేర్‌ చేస్తామని బెదిరించడం.. ఆపై వారిని లైంగికంగా వేధించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి చర్యలకు చెక్‌ పెట్టే విధంగా ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ల్లో ఎక్కడైనా నగ్నత్వం కనిపిస్తే దాన్ని ‘బ్లర్‌’ (మసకబార్చడం) చేసేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. లైంగిక నేరాలు, ఫొటోల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు నేరస్థులు యువతను టార్గెట్‌ చేయకుండా అరికట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, దీనిలో భాగంగా ఈ కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం తెలిపింది. 18 ఏళ్లలోపు వయసున్న వారికి ఈ ఫీచర్‌ డీఫాల్ట్‌గా ఆన్‌ అవుతుందని, 18 ఏళ్లు నిండిన వినియోగదారులకు మాత్రం దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్‌ వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్‌తో నగ్నత్వం ఉన్న ఫొటోలు బ్లర్‌గా కనిపిస్తాయి. వాటిని పంపిన వ్యక్తిని బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 12 , 2024 | 09:14 AM