IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి
ABN , Publish Date - May 20 , 2024 | 04:08 PM
ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు.
ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు. ఆగ్రా నగరంలో ముగ్గురు షూ వ్యాపారులకు సంబంధించిన ఆరు చోట్ల ప్రాంగణాల్లో ఈ ఐటీ దాడులు నిర్వహించామని, ఒక వ్యాపారవేత్త నివాస ప్రాంగణంలో పెద్ద మొత్తంలో నగదు లభ్యమైందని వెల్లడించారు. హర్మిలాప్ సంస్థ యజమాని రామ్‌నాథ్ డాంగ్‌కు చెందిన నివాసంలో ఈ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఎలా బయట పడిందంటే?
ముగ్గురు వ్యాపారస్తులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారం అందడంతో ఆదాయ పన్నుశాఖ రంగంలోకి దిగింది. పకడ్బందీగా ఏకంగా ఆరు చోట్ల ఐటీ సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. మంచం, పరుపులు, అల్మారా కింద నోట్లను దాచి పెట్టారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. మంచంపై, మంచ పక్కన కుప్పలు కుప్పలుగా పడివున్న నోట్ల కుప్పలు ఆ ఫొటోల్లో కనిపించాయి. కింద కూడా కొన్ని బ్యాగులు నగదుతో నిండి ఉండడం ఫొటోల్లో కనిపించింది. కాగా భారీ స్థాయిలో పట్టుబడ్డ ఈ నగదును లెక్కించడానికి అధికారులు బ్యాంకు నుంచి ఏకంగా 10 నోట్ల లెక్కింపు యంత్రాలను తెచ్చుకోవాల్సి వచ్చిందని అధికారులు వివరించారు.
కాగా ఆగ్రాకు చెందిన ముగ్గురు వ్యాపారస్తులు పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ప్రమేయం ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం మేరకు ముందుగా ఆగ్రా నగరంలో ఆరు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించడంతో పెద్ద మొత్తంలో నగదు, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Latest National News and Telugu News