Share News

Amit Shah : ఎన్నికల బాండ్ల రద్దు కంటే మెరుగుపరిస్తే బాగుండేది

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:43 AM

రాజకీయాల్లో నల్లధనాన్ని అంతమొందించడానికి తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం కంటే పథకాన్ని మెరుగుపరిస్తే బాగుండేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్‌ బాండ్ల అంశంలో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు

Amit Shah : ఎన్నికల బాండ్ల రద్దు కంటే మెరుగుపరిస్తే బాగుండేది

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ, మార్చి 16 : రాజకీయాల్లో నల్లధనాన్ని అంతమొందించడానికి తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం కంటే పథకాన్ని మెరుగుపరిస్తే బాగుండేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్‌ బాండ్ల అంశంలో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. అసలు రాహుల్‌కు అలాంటి మాటలు ఎవరు రాసిస్తారో ? అంటూ ఎద్దేవా చేశారు. ఎలక్టోరల్‌ బాండ్లు రద్దు వల్ల రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో మళ్లీ నల్లధనం వచ్చే ముప్పు ఉందన్నారు. ‘‘బీజేపీ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.20,000 కోట్లు వచ్చాయి. ఇందులో బీజేపీకి రూ.6వేల కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.14వేల కోట్ల మాటేంటి? బీజేపీని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు బదులివ్వాలి’’ అని షా నిలదీశారు. అలాగే, నగదు రూపంలో విరాళాలు సేకరించే సమయంలో కాంగ్రె్‌సకు రూ.1100 విరాళామిస్తే అందులో రూ.100నే పార్టీ ఖాతాలో జమ చేసేవారిని ఆరోపించారు. మిగిలిన రూ.1000 కాంగ్రెస్‌ నేత జేబులోకి వెళ్లేవని పేర్కొన్నారు. ప్రజాధనం వృథాను అరికట్టడానికే తాము జమిలి ఎన్నికలు కోరుకుంటున్నామని అమిత్‌ షా స్పష్టం చేశారు.

Updated Date - Mar 17 , 2024 | 08:19 AM