Share News

Jharkhand Assembly elections : గెలిపించిన ‘సోరెన్‌ సంక్షేమం’

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:59 AM

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో సంక్షేమ పథకాలు ప్రధాన భూమిక

Jharkhand Assembly elections : గెలిపించిన ‘సోరెన్‌ సంక్షేమం’

రాంచీ: ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో సంక్షేమ పథకాలు ప్రధాన భూమిక పోషించాయి. ఎన్నికల ప్రచారంలో భారీగా సంక్షేమ పథకాలను ప్రకటించడంతో జేఎంఎం(ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా) నేతృత్వంలోని ఇండియా కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. ప్రధానంగా ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్‌ యోజన కింద మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.వెయ్యిని రూ. 2,500కు పెంచుతామని, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్యార్థులకు పీహెచ్‌డీ వరకు ఉచితవిద్య అందిస్తామని, వ్యవసాయానికి వడ్డీ రహిత రుణాలిస్తామని, అటవీ సంరక్షణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించడం ద్వారా గ్రామసభ అధికారాలను పునరుద్ధరిస్తామని హేమంత్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతోపాటు అలాగే, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లుల మాఫీ, సహారా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 24 , 2024 | 03:59 AM