Share News

Jharkhand: కొలువు తీరిన కేబినెట్‌.. చంపాయి సోరెన్‌కు చోటు

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:59 PM

ఝార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన కొన్ని గంటలకే సీఎం హేమంత్ సోరెన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో సోమవారం ఇన్‌చార్జీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పలువురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

Jharkhand: కొలువు తీరిన కేబినెట్‌.. చంపాయి సోరెన్‌కు చోటు

రాంచీ, జులై 08: ఝార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన కొన్ని గంటలకే సీఎం హేమంత్ సోరెన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో సోమవారం ఇన్‌చార్జీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పలువురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు జేఎంఎం ఎమ్మెల్యేలు వైద్యనాథ్ రామ్, బాబీ దేవి, మిథిలేష్ ఠాకూర్, దీపక్ బైరువా, హఫిజుల్ హసన్‌.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, ఇర్ఫాన్ అన్సారీ, దీపక్ పాండే సింగ్‌.. ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ బోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు.

Also Read: KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

Also Read:By Poll: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ‘పరీక్ష’

Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం


ఈ జనవరి 31వ తేదీన భూ కుంభకోణంలో.. మని లాండరింగ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఝార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కేసులో జూన్ 28న హేమంత్ సోరెన్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అదే రోజు జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. దీంతో సీఎం పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేశారు. ఆ క్రమంలో జులై 4న ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం స్వీకారం చేశారు. మరోవైపు ఈ రోజు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. 81 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 45 మంది సోరెన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ పరీక్షల్లో నెగ్గడంతో.. అనంతరం కొన్ని గంటలకే సీఎం సోరెన్ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

Also Read: CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !


మరోవైపు ఈ ఏడాది చివరల్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ జాబితాలో ఝార్ఖండ్ సైతం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలంటూ ఆ పార్టీ నేత హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకోగా, జేఎంఎం మాత్రం కేవలం 3 స్థానాల్లో విజయం సాధించింది. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు

Also Read: Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?

Read Latest News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 09:00 PM