Share News

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

ABN , Publish Date - Feb 07 , 2024 | 05:24 PM

ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది.

Karnataka Politics: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా.. ఏకంగా సీఎం ఆఫీస్‌కి తాళం వేసే యత్నం

ప్రస్తుతం కన్నడ రాజకీయాలు కాక రేపుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. అటు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపబడుతుంటే.. అందుకు కౌంటర్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. బెంగళూరులోని సీఎం ఆఫీస్‌కి తాళం వేసేందుకు కొందరు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో.. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.


అసలు ఏమైందంటే.. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు (ఎమ్మెల్యేలు, ఎంపీలు) నిరసనకు దిగారు. రాష్ట్రాలకు పన్నుల నిధుల కేటాయింపులో కేంద్రం తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ.. ఈ నేతలందరూ ఇలా ఆందోళన చేపట్టారు. పన్నుల పంపిణీ, కరువు పరిహారంతో పాటు సహాయ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని వాళ్లు ఆరోపించారు. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తమ విన్నపం కేంద్రం వింటుందనే ఉద్దేశంతోనే తాము ఈ నిరసన చేపట్టామని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ఉద్దేశమని తెలిపారు.

ఇలా కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలకు కౌంటర్‌గా బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. ఢిల్లీతో పాటు కర్ణాటకలోనూ నిరసనలు చేపడుతూ.. కేంద్రం ఇస్తున్న నిధుల్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అటు కరువు రైతులకు పరిహారం, పాడి రైతులు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా.. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కొందరు బీజేపీ కార్యకర్తలు సీఎం కార్యాలయానికి తాళం వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని, జలఫిరంగులు ప్రయోగించారు. దీంతో.. బీజేపీ నేతలు, పోలీసుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. కొందరు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 05:24 PM