Home » Siddaramaiah
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.
ముడా కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని గత అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.
మైసూర్ అర్బన్ డవలప్మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సీఎం సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దసరా తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది.
తన భూములను ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్టు తన భార్య ప్రకటించడం, లేఖ రాయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగాయి.