Karti Chidambaram : అర్థం లేని పనిగంటలు వ్యర్థమే
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:41 AM
వారానికి 70 పని గంటలు ఉండాలన్న ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి ప్రతిపాదనను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తప్పుబట్టారు. సామర్థ్యంపై దృష్టి పెట్టాలి తప్ప అర్థంలేని సుదీర్ఘ పని
న్యూఢిల్లీ, డిసెంబరు 23: వారానికి 70 పని గంటలు ఉండాలన్న ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి ప్రతిపాదనను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తప్పుబట్టారు. సామర్థ్యంపై దృష్టి పెట్టాలి తప్ప అర్థంలేని సుదీర్ఘ పని గంటలపై కాదని కార్తీ చెప్పారు. అసలు వారానికి నాలుగు పనిదినాలే ఉండాలన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా పని గంటలు ముగిసిపోవాలని సూచించారు. వృత్తి జీవితంతో వ్యక్తిగత జీవితానికి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని ఎక్స్‌లో ఆయన సోమవారం పోస్ట్ చేశారు. గతనెలలో సీఎన్‌బీసీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి వారానికి 70 పని గంటలు ఉండటం దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు.