Share News

Kharge : ఈసీ సమగ్రతను దెబ్బతీసే కుట్ర

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:37 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సమగ్రతను మోదీ ప్రభు త్వం నాశనం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

Kharge : ఈసీ సమగ్రతను దెబ్బతీసే కుట్ర

సీసీటీవీ ఫుటేజ్‌, వీడియోలు ఇవ్వొద్దనడంపై ఖర్గే ఆగ్రహం

న్యూఢిల్లీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సమగ్రతను మోదీ ప్రభు త్వం నాశనం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ఎన్నికల నిర్వహణకు సంబంఽధించిన ఎలకా్ట్రనిక్‌ సమాచారమైన సీసీటీవీ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులను ప్రజల తనిఖీ నిమిత్తం ఇవ్వాల్సిన పనిలేదంటూ కేంద్ర న్యాయశాఖ నిబంధనలను సవరించడాన్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ‘తొలుత ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌ నుంచి వారు భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలున్నా.. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. క్వాసీ-జ్యుడీషియల్‌ సంస్థ అయిన ఈసీ.. స్వతంత్రంగా వ్యవహరించడం లేదనడానికి ఇది మరో రుజువు’ అని ఖర్గే పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 03:38 AM