Share News

Kolkata doctor murder:వైద్య విద్యార్థి హత్య.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి కీలక విషయాలు

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:23 PM

లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైందన్నారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి తీవ్రంగా రక్త స్రావమైందని తెలిపారు. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.

Kolkata doctor murder:వైద్య విద్యార్థి హత్య.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో వెలుగులోకి కీలక విషయాలు

కోల్‌కతా, ఆగస్ట్ 10: స్థానిక ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో శవమై తేలిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైనీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయం వెలుగులోకి వచ్చాయని పోలీస్ ఉన్నతాధికారి శనివారం కోల్‌కతాలో వెల్లడించారు.

పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు.. నిందితుల కోసం ప్రత్యేక బృందం...

లైంగిక దాడి చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టమైందన్నారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి తీవ్రంగా రక్త స్రావమైందని తెలిపారు. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. వాటి ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.

అయితే అతడు మెడికల్ కాలేజీతో సంబంధం లేని వ్యక్తిగా గుర్తించామన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు వైద్యులను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వివరించారు. ఇక వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 6 గంటల మధ్య చోటు చేసుకుందన్నారు. ఈ పోస్ట్‌మార్టం నివేదిక నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని పోలీస్ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలి మృతి కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

Also Read: wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ


స్పందించిన మృతురాలి తండ్రి.. సీఎం మమత హామీ..

ఈ ఘటనపై మృతురాలి తండ్రి స్పందించారు. ఆర్ జి మెడికల్ ఆసుపత్రిలో తమ కుమార్తెపై లైంగిక దాడి చేసి హత్య చేశారన్నారు. అయితే ఇందులోని దాగున్న నిజాలను దాచిపట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మృతిరాలి తల్లిదండ్రులను సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తెల్లవారుజామున 2.00 గంటల వరకు జూనియర్ డాక్టర్లతోనే ఆమె ఉందని.. అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు కాన్ఫరేన్స్ హాల్‌ల్లోకి వెళ్లిందని ఓ వైద్యుడు వెల్లడించారు. ఉదయం చూసే సరికి కాన్ఫరెన్స్ హాల్లో ఆమె విగత జీవిగా పడి ఉందన్నారు.

Also Read: Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్


సహచర విద్యార్థుల క్యాండిల్ ర్యాలీ..

సహచర వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా వైద్య విద్యార్థులు శుక్రవారం రాత్రి కోల్‌కతాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ స్పందించారు. ఈ కేసులో నిందితులను ప్రభుత్వం పట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని.. సిగ్గుతో తల దించుకుంటున్నానన్నారు. ఓ వైద్యురాలిపై ఈ విధంగా దాడి చేయడం విషాదమని అభివర్ణించారు.

Also Read: Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్


కాలేజీ ప్రిన్సిపల్, బీజేపీ నేత స్పందన..

ఇక మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సైతం స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇంత దారుణంగా హత్య చేసిన నిందితులను సాధ్యమైంత త్వరగా పోలీసులు పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీజేపీ సీనియర్ నేత అగ్నిమిత్ర పౌల్ స్పందించారు. ఆమెపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేశారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయినా.. సాయంత్రం శవానికి పోస్ట్ మార్టం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.

Also Read: Agniveers passing out parade: ‘అగ్నివీర్’పై భారత నేవీ చీఫ్ ప్రశంసల జల్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 01:23 PM