Share News

నేవీలో హెలికాప్టర్‌ తొలి మహిళా పైలట్‌గా అనామిక

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:24 AM

భారత నౌకాదళంలో హెలికాప్టర్‌ తొలి మహిళా పైలట్‌ లెఫ్టినెంట్‌ అనామిక రాజీవ్‌ బుధవారం విశాఖపట్నంలో బాధ్యతలు స్వీకరించారు.

నేవీలో హెలికాప్టర్‌ తొలి మహిళా పైలట్‌గా అనామిక

విశాఖ ఐఎన్‌ఎస్‌ డేగలో తొలి పోస్టింగ్‌

విశాఖపట్నం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలో హెలికాప్టర్‌ తొలి మహిళా పైలట్‌ లెఫ్టినెంట్‌ అనామిక రాజీవ్‌ బుధవారం విశాఖపట్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్‌ డేగలో ఆమె విధులు నిర్వహించనున్నారు. నేవీ హెలికాప్టర్లలో సీ కింగ్‌, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌, చేతక్‌, ఎంహెచ్‌-60ఆర్‌ సీ హాక్స్‌కు ఆమె సారథ్యం వహిస్తారు. నాలుగేళ్ల క్రితం నిఘా విమానం డార్నియర్‌లో తొలి మహిళా పైలట్‌గా శుభాంగి స్వరూప్‌ బాధ్యతలు చేపట్టారు. ఈసారి హెలికాప్టర్లను నడిపే బాధ్యత మహిళలకు అప్పగించారు. అందులో అనామికకు మొదటి అవకాశం లభించింది. అనామిక రాజీవ్‌ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆమె తమిళనాడులోని ఐఎన్‌ఎస్‌ రజాలీలో హెలికాప్టర్‌ శిక్షణ పొందారు. అక్కడ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ఆరు నెలల క్రితం తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ చేతులు మీదుగా ‘గోల్డెన్‌ వింగ్స్‌’ను పొందారు. ఆమెకు తొలి పోస్టింగ్‌ విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగలో ఇచ్చారు.

Updated Date - Dec 26 , 2024 | 05:24 AM