Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

BJP Lok Sabha first list: బీజేపీ తొలి జాబితా ప్రముఖులలో అమిత్‌షా, రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ

ABN , Publish Date - Mar 02 , 2024 | 07:31 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం శనివారంనాడు విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, 34 మందికి పైగా కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.

BJP Lok Sabha first list: బీజేపీ తొలి జాబితా ప్రముఖులలో అమిత్‌షా, రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా (First List)ను బీజేపీ (BJP) అధిష్ఠానం శనివారంనాడు విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, 34 మందికి పైగా కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వరుసగా మూడోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi) నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. హోం మంత్రి అమిత్‌షా (Amist shah) మరోసారి గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీలో ఉన్నారు.


కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేధీ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, మనోజ్ తివారీ, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి, ఆల్వార్ నుంచి రాజ్యసభ ఎంపీ భూపెందర్ యాదవ్, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం నుంచి రాజ్యసభ సభ్యుడు, మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విధిష లోక్‌సభ సీటు కేటాయించారు.


పూర్తి జాబితా ఇదే..

1. అమిత్‌షా-గాంధీనగర్

2.జ్యోతిరాదిత్య సింధియా-గోవా

3.రాజీవ్ చంద్రశేఖర్-తిరువనంతపురం

4.గీతాకోడా-సింగ్భుమ్

5.విజయ్ బఘెల్-దుర్గ్

6.బ్రిజ్‌మెహన్ అగర్వాల్-రాయపూర్

7.ప్రవీణ్ ఖండేల్వాల్-చాంద్‌నీ చౌక్

8.బన్సూరి స్వరాజ్-న్యూఢిల్లీ

9.సీఆర్ పాటిల్-నవ్‌సరి

10.డాక్టర్ జితేంద్ర సింగ్-ఉదంపూర్

11.మనీష్ జైశ్వాల్-హజారీబాఘ్

12.అర్జున్ ముండే-ఖుంటీ

13.శివరాజ్ సింగ్ చౌహాన్-విదిశ

14.అర్జున్ రామ్ మేఘ్వల్-బికనెర్

15.భూపేంద్ర యాదవ్-అల్వార్

16.జ్యోతి మిర్దా-నాగౌర్

17.గజేంద్ర సింగ్ షెకావత్-జోథ్‌పూర్

18.సీపీ జోషి-ఛిత్తోర్‌గఢ్

19.దుష్యంత్ సింగ్-ఝాలవార్-బరాన్ (వసుంధరా రాజే తనయుడు)

20.ఓం బిర్లా-కోట

21.ఈటెల రాజేందర్-మల్కాజ్‌గిరి

22.సర్బానంద సోనోవాల్-దిబ్రూగఢ్

23.బిప్లబ్ కుమార్ దేబ్-త్రిపుర ఈస్ట్

24.డాక్టర్ సంజీవ్ కుమార్ బలియాన్-ముజఫర్ నగర్

25.డాక్టర్ మహేష్ శర్మ-గౌతమ్ బుద్ధ నగర్ (నొయిడా)

26.హేమమాలిని-మధుర

27.అజయ్ మిశ్రా తేని-ఖేరి

28.సాక్షి మహరాజ్-ఉన్నావో

29.రాజ్‌నాథ్ సింగ్-లక్నో

30.స్మృతి జుబిన్ ఇరానీ-అమేథీ

31.సాధ్వి నిరంజన్ జ్యోతి-ఫతేపూర్

32.జగదాంబికా పాల్-దోమరియగంజ్

33.దినేష్ లాల్ యాదవ్ నిరహువ-అజంగఢ్

34.రవికిషన్-గోరఖ్‌పూర్

35.డాక్టర్ సుకాంత మజుందార్-బలుర్‌ఘాట్

36.లాకెట్ ఛటర్జీ-హుగ్లీ

37.పవన్ సింగ్-అసాంసోల్

38.రామ్ వీర్ సింగ్ బిదూరి-సౌత్ ఢిల్లీ

Updated Date - Mar 02 , 2024 | 09:09 PM