మోదీ ప్రసంగాల్లో ‘ఆర్‌ఎస్‌ఎస్ కంపు’
ABN , Publish Date - Apr 09 , 2024 | 04:17 AM
కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ‘న్యాయపత్ర’లో ముస్లిం లీగ్ ముద్ర ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ
ఎవరెవరి పక్షమో అందరికీ తెలుసు
బీజేపీ గ్రాఫ్ దిగజారుతోంది
అందుకే మా మేనిఫెస్టోపై నిందలు
కాంగ్రెస్ న్యాయపత్రలో ముస్లింలీగ్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన ఖర్గే
ప్రధానిపై ఈసీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ‘న్యాయపత్ర’లో ముస్లిం లీగ్ ముద్ర ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోదీ ప్రసంగాలు ఆర్‌ఎ్‌సఎస్ కంపు కొడుతున్నాయని దుయ్యబట్టారు. మరోవైపు ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులు పెట్టిన ఖర్గే ప్రధాని సహా బీజేపీ సైద్ధాంతిక వాది, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యోద్యమకాలంలో కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు ముఖర్జీ మద్దతు పలికారని విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ-అమిత్‌షాలు తమ రాజకీయ సైద్ధాంతికులుగా పేర్కొంటున్న వారు స్వాతంత్ర్యోద్యమకాలంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటీషర్లకు, ముస్లింలీగ్‌కు మద్దతు పలికారు. ఆఖరుకు ఈ రోజు కూడా కాంగ్రెస్ న్యాయపత్రకు వ్యతిరేకంగా ముస్లింలీగ్‌ను ప్రయోగిస్తున్నారు. కానీ, మా న్యాయపత్ర.. దేశంలోని సాధారణ పౌరుల అవసరాలు, ఆకాంక్షలు, వారి డిమాండ్లకు అద్దం పడుతోంది’’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘‘మోదీ ప్రసంగాలు ఆర్‌ఎ్‌సఎస్ కంపు కొడుతున్నాయి. బీజేపీ ఎన్నికల గ్రాఫ్ రోజు రోజు పడిపోతోంది. అందుకే ఆర్‌ఎ్‌సఎస్ తమ ప్రియమిత్రుడు ముస్లింలీగ్‌ను గుర్తు చేసుకుంటోంది’’ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ప్రధాని మోదీపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. మరోనేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ముస్లింలీగ్‌ను ఎందుకు ఆపాదిస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్, ఎన్సీ సీట్ల ఒప్పందం ఖరారు
జమ్ము కశ్మీర్‌లోని ఐదు, లఢక్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరింది. చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉధంపూర్, జమ్ము, లఢక్ సీట్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు, అనంత్‌నాగ్, బారాముల్లా, శ్రీనగర్‌ల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. కాగా, అనంత్‌నాగ్ నుంచి పీడీపీ అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ స్వయంగా పోటీ పడుతున్నారు. దీంతో ఇక్కడ ఎన్సీ, పీడీపీ, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే, బరిలోఉండాలా? వద్దా? అన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆజాద్ చెప్పారు.
వచ్చేది మేమే!: రాహుల్
శివనీ, ఏప్రిల్ 8: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఢీమా వ్యక్తంచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సారి విప్లవాత్మక నిర్ణయాలు చేర్చామన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలతోపాటు పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.లక్ష చొప్పన జమ చేస్తామని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ శివనీ జిల్లా మాండ్లా లోక్‌సభ స్థానం పరిధిలోని ధనోరాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ‘ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ఇప్పుడిస్తున్న వేతనాలను రెట్టింపు చేస్తాం. దేశంలోని ప్రతి నిరుద్యోగికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏడాదిపాటు అప్రెంటి్‌సషిప్ ఇచ్చేలా కొత్త చట్టం తెచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగాల విధానానికి స్వస్తి చెబుతాం. పంటలకు కనీస మద్దతు కోసం చట్టం రూపొందిస్తాం.’ అని రాహుల్ పేర్కొన్నారు