Share News

Shocking Train Travel: టిక్కెట్‌కు డబ్బుల్లేవని.. రైలు చక్రాల మధ్య దాక్కుని.. ఈ వ్యక్తి ఎంత దూరం జర్నీ చేశాడో తెలుసా..

ABN , Publish Date - Dec 27 , 2024 | 08:38 PM

చక్రాల మధ్య దాక్కుని అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తిని అధికారులు ప్రశ్నించినప్పుడు, టిక్కెట్‌కు తగిన డబ్బులు లేకపోవడంతోనే రైలు కింద దాక్కుని ప్రయాణించినట్టు అతను వెల్లడించారు.

Shocking Train Travel: టిక్కెట్‌కు డబ్బుల్లేవని.. రైలు చక్రాల మధ్య దాక్కుని.. ఈ వ్యక్తి ఎంత దూరం జర్నీ చేశాడో తెలుసా..

న్యూఢిల్లీ: ప్రమాదాలు చెప్పి రావని తెలిసినా ప్రాణాలకు తెగించి ఒక వ్యక్తి చేసిన అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద చక్రాల మధ్య కూర్చుని ఇటార్సీ నుంచి బజల్‌పూర్ వరకూ 250 కిలోమీటర్లు ఆ వ్యక్తి ప్రయాణం సాగించాడు. రైల్వే ఉద్యోగులు ఎస్-4 కోచ్ సమీపంలో రొటీన్ చెకప్ చేస్తుండగా చక్రాల కింద దాక్కుని ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తించడం, వైర్‌లెస్ కమ్యూనికేషన్ ద్వారా పైలట్‌కు ఆ విషయం చెప్పడంతో రైలు ఆపడం, ఆ వ్యక్తిని పట్టుకుని వేగన్ డిపార్ట్‌మెంట్‌ (AV&W)కు అప్పగించడంతో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

Manmohan Singh: నా పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేశారు.. మన్మోహన్‌ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న మలేషియా ప్రధాని


ప్రాణాలతో రిస్క్ ఎందుకు చేశాడంటే..?

చక్రాల మధ్య దాక్కుని అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తిని అధికారులు ప్రశ్నించినప్పుడు, టిక్కెట్‌కు తగిన డబ్బులు లేకపోవడంతోనే రైలు కింద దాక్కుని ప్రయాణించినట్టు అతను వెల్లడించారు. దనపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఎస్-4 కోచ్‌ కింద దాక్కున్నానని, తన ప్రయాణం మొత్తం రైలు చక్రాల మధ్యే సాగించినట్టు వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రయాణికులు ఎవరూ గమనించనప్పటకీ రోలింగ్ స్టాక్ ఇన్‌స్పెక్షన్ కోసం వచ్చిన రైల్వే సిబ్బంది ఒకరు గుర్తించారు. వీల్స్ కింద దాక్కున్న వ్యక్తి కనిపించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇంత ప్రమాదకర ప్రయాణం చేసి ప్రాణాలతో బయటపడటం నిజంగానే ఒక అద్భుతమని అతను వ్యాఖ్యానించాడు.


తాజా ఘటనతో ప్రయాణికుల భద్రత, టిక్కెట్ల లేకుండా ప్రయాణించడానికి కొందరు ఎంచుకుంటున్న ప్రమాదకర పద్ధతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి డేంజరస్ ఫీట్స్‌పై రైల్వే అధికారులు మరింత అప్రత్తమవుతున్నారు.


ఇవి కూడా చదవండి...

Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో

Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 09:00 PM