Share News

CM Biren Singh: రాష్ట్రం నుంచి వాళ్లను తరిమేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:27 PM

మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్‌కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు. కులం, కమ్యూనిటీని పట్టించుకోకుండా.. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరికి వెనక్కు తిరిగి పంపిస్తామని ఉద్ఘాటించారు.

CM Biren Singh: రాష్ట్రం నుంచి వాళ్లను తరిమేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్‌కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు. కులం, కమ్యూనిటీని పట్టించుకోకుండా.. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరికి వెనక్కు తిరిగి పంపిస్తామని ఉద్ఘాటించారు. మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్ మాఫికా, అక్రమ వలసదారులు, ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థుల కారణంగానే మణిపూర్‌లో హింస, అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. వలసదారుల్ని తిప్పి పంపించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇంఫాల్‌లో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ప్రస్తుతం మేము అత్యంత కష్టకాలంలో ఉన్నామన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఉనికి, మనుగడ, ఐటెండిటీ కోసం పోరాటం జరుగుతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ మనం జీవించాలి, మనుగడను కొనసాగించాలి. ఇక నుంచి భారత్, మయన్మార్ మధ్య ఫ్రీ మూమెంట్ రిజైమ్ (ఎఫ్ఎంఆర్) ఉండదు. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తాం. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం భవిష్యత్తు తరాలకు ఉండకూడదు. అందుకే.. ఈ చర్యలు చేపట్టబోతున్నాం’’ అంటూ బైరెన్ సింగ్ చెప్పుకొచ్చారు. మణిపూర్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్‌కు ‘1961’ బేస్ ఇయర్‌గా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పౌర సమాజ సమూహాలు, రాజకీయ పార్టీలు 1951ని బేస్ ఇయర్‌గా నిర్ణయించాలని కోరాయి గానీ.. 2022 జూన్‌లో రాష్ట్ర మంత్రివర్గం 1961ని బేస్ ఇయర్‌గా స్వీకరించాలని డిసైడ్ అయ్యింది.

Updated Date - Feb 13 , 2024 | 03:27 PM