Share News

Chhattisgarh: లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ.. కీలక అంశాలు ప్రస్తావన

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:19 PM

వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. ఆ క్రమంలో దండకారణ్యం వేదికగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో ఆ ప్రాంతమంతా ఎర్రబారుతోంది.

Chhattisgarh: లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ.. కీలక అంశాలు ప్రస్తావన

రాయ్‌పూర్, జూన్ 22: వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. ఆ క్రమంలో దండకారణ్యం వేదికగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో ఆ ప్రాంతమంతా ఎర్రబారుతోంది. ఛత్తీస్‌గఢ్‌‌లో వరుసగా చోటు చేసుకుంటున్న ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ తగులుతంది. అలాంటి వేళ మావోయిస్ట్ కేంద్ర కమిటి శనివారం లేఖ విడుదల చేసింది.

Also Read: Madhya Pradesh Govt: పాఠ్యాంశాల్లో రాముడు, కృష్ణుడు సరే.. మరి ఆ పాపాలకు బాధ్యులు ఎవరు?


ఆ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది జులై 28వ తేదీ నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ వారోత్సవాలను పొరాట పటిమతో ఉత్తేజం చేయాలని కామ్రేడ్లకు పిలుపు నిచ్చింది. అలాగే ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు, గెరిల్లా పోరాటాలకు సైతం మావోయిస్టులు ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

Also Read: Video Viral: బిహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలో రెండో ఘటన


ఈ ఏడాదిలో పీపుల్స్ లిబరేషన్ గోరెల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) దాడుల్లో 112 మంది పోలీసులు హతమయ్యారని, అలాగే 246 మందికి గాయాలయ్యాయని తెలిపింది. 10 మంది బీజేపీ నేతలతోపాటు 58 మంది ప్రజా వ్యతిరేక శక్తులుగా భావించే ఇన్ఫార్మర్లను హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ తన లేఖలో స్పష్టం చేసింది.

Also Read: Swati Maliwal assault case: బిభవ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు


ఇక మావోయిస్ట్‌‌ల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌లో భాగంగా పోలీస్ బలగాలు 22 సార్లు చుట్టి ముట్టి దాడులు చేసిందని.. 30 ఎన్‌కౌంటర్లు జరిగాయిన పేర్కొంది. ఈ ఏడాదిలో 104 మంది మావోయిస్ట్‌లు హతమయ్యారంది. అందులో 58 మంది ప్రజా విప్లవకారులు మరణించారని.. వారిలో కామ్రేడ్ దామా, జోగన్న, సాగర్ తదితర కీలక నేతలు ఉన్నారని గుర్తు చేసింది.

Also Read: Delhi Water Crisis: మంచి నీటి కోసం ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు.. ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే..?


దక్షిణ బస్తర్‌లోని ధర్మారం క్యాంప్‌పై మావోయిస్ట్‌ల మెరుపు దాడిలో పోలీస్ బలగాలకు చెందిన 50 మంది హతమయ్యారని.. మరో 90 మంది గాయపడ్డారని వివరించింది. జీరగూడ క్యాంప్‌పై మావోయిస్ట్‌ల మెరుపు దాడిలో పోలీస్ బలగాలకు చెందిన అయిదుగురు మరణించగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయని విడుదల చేసిన లేఖలో మావోయిస్ట్ పార్టీ సోదాహరణగా వివరించింది.

Also Read: Viral Video: కాగితాలు చూపించమని ట్రాఫిక్ పోలీస్ అడిగితే.. కారు డ్రైవర్ ఏం చేశాడంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2024 | 08:19 PM