Home » Maoist Encounter
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోలు హతమయ్యారు.
బస్తర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని.. కగార్ నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కోరింది. తమ డిమాండ్‌ను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ నిరాకరించారని, ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ప్రజలు భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారని, యువతి-యువకులు పారిపోతున్నారని, ఈ దిశగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఒకేరోజు ఏకంగా 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.
మావోయిస్టు నేత రేణుక అలియాస్ భాను, సుధీర్‌లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బెల్నార్‌లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది.
కేంద్రప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పపట్టింది.
దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.