Parliament: నేడు పార్లమెంటులో ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఉదయం ఒక్కసారిగా కలకలం.. నకిలీ ఆధార్ కార్డులతో..
ABN , Publish Date - Jun 07 , 2024 | 08:55 AM
ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ సమావేశం. ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి గేట్ నంబర్ 3 ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.
ఢిల్లీ: ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ సమావేశం. ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి గేట్ నంబర్ 3 ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది సీఐఎస్ఎప్ బలగాలు ముగ్గురిని పట్టుకున్నాయి. ఆ ముగ్గురిని ఖాసిం, మోనిస్, షోయబ్‌గా గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగనుంది.
ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సంవిధాన్ భవన్ (పాత పార్లమెంట్ భవనం) సెంట్రల్ హాల్‌లో సమావేశం జరగనుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు, ఎన్డీఏ ఎంపీలు హాజరుకానున్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ పక్ష నేతలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎన్డీఏ ఎంపీలు సంతకాలతో కూడిన లేఖను ఇవ్వనున్నారు. జూన్ 9 సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!