Share News

Jammu Kashmir: సరిహద్దులో ఉగ్రవాదుల కవ్వింపులు.. కాల్పుల్లో ఒకరు మృతి

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:54 PM

సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) రాజధాని శ్రీనగర్‌(SriNagar)లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వలస కార్మికుడు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. బాధితుడు అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసి.

Jammu Kashmir: సరిహద్దులో ఉగ్రవాదుల కవ్వింపులు.. కాల్పుల్లో ఒకరు మృతి

కశ్మీర్: సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) రాజధాని శ్రీనగర్‌(SriNagar)లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వలస కార్మికుడు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. బాధితుడు అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసి. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

శ్రీనగర్‌లోని షహీద్ గంజ్‌లో ఈ ఘటన జరిగినట్లు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది వెల్లడించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించడానికి గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. 2023 అక్టోబర్‌లో పుల్వామాలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2024 | 08:55 PM