Share News

Militants ambush Manipur: సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్ల కాల్పులు..

ABN , Publish Date - Jun 10 , 2024 | 02:51 PM

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అడ్వాన్స్‌ సెక్యూరిటీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు సోమవారంనాడు కాల్పులకు తెగబడ్డారు. కల్లోలిత జీరాబామ్ జిల్లాకి కాన్వాయ్ వెళ్తుండగా మార్గమధ్యంలోని కాంగ్పోక్పి జిల్లాలో మిలిటెంట్లు పలురౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

Militants ambush Manipur: సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్ల కాల్పులు..

ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) అడ్వాన్స్‌ సెక్యూరిటీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు సోమవారంనాడు కాల్పులకు తెగబడ్డారు. కల్లోలిత జీరాబామ్ జిల్లాకి కాన్వాయ్ వెళ్తుండగా మార్గమధ్యంలోని కాంగ్పోక్పి జిల్లాలో మిలిటెంట్లు పలురౌండ్లు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. జాతీయ రహదారి 53 వెంబడి కొట్లేన్ గ్రామం సమీపంలో ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. మిలిటెంట్ల దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలియజేసింది.

Terror Attack: యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్


ఢిల్లీ నుంచి ఇంఫాల్ తిరిగి వచ్చిన బీరేన్ సింగ్ ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జీరాబామ్‌లో పర్యటించాలనే యోచనలో ఉన్నారు. కాగా, శనివారంనాడు జీరాబామ్‌లో చెలరేగిన హింసాకాండలో రెండు పోలీస్ ఔట్‌పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ కార్యాలయం, కనీసం 70 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 59 ఏళ్ల మైతీ రైతు శరత్‌కుమార్ సింగ్ కొద్ది వారాలుగా కనిపించకుండా పోవడం, ఆయన మృతదేహాన్ని ఆ తర్వాత కనుగొనడంతో జూన్ 6న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా హింసాకాండ తలెత్తింది. మణిపూర్‌లో కల్లోలిత పరిస్థితుల ప్రభావం పొరుగున ఉన్న అసోంలో కూడా కనిపిస్తోంది. మణిపూర్‌లో జాతుల వైరంతో సుమారు 600 మంది శరణారుర్ధులుగా అసోంకు పారిపోవడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 02:51 PM