మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తాం
ABN , Publish Date - Apr 18 , 2024 | 04:32 AM
దేశంలో మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తామని.. ఈ చర్య ఎంతో దూరంలో లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. నక్సలిజంతోపాటు.. టెర్రరిజాన్ని కూడా
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వచ్చాక యాంటీ-నక్సల్స్ ఆపరేషన్స్ వేగిరం
భద్రతా బలగాల క్యాంపులను 250కి పెంచాం
అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తాం
అహ్మదాబాద్, ఏప్రిల్ 17: దేశంలో మావోయిస్టులను కూకటివేళ్లతో పెకిలిస్తామని.. ఈ చర్య ఎంతో దూరంలో లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. నక్సలిజంతోపాటు.. టెర్రరిజాన్ని కూడా తుడిచిపెట్టేస్తామని మోదీ సర్కారు కంకణబద్ధమై ఉందన్నారు. బుధవారం ఆయన అహ్మదాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘‘కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు క్యాంపులను పెంచాం. 2019 నుంచి వీటి ఏర్పాటు ముమ్మరమైంది. ఛత్తీ్‌సగఢ్ 250 క్యాంపులను ఏర్పాటు చేశాం. ఛత్తీ్‌సగఢ్‌లో మా(బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్‌కౌంటర్లలో 80 మంది దాకా నక్సల్స్ మృతిచెందారు. 125 మంది అరెస్టయ్యారు. 150 మంది లొంగిపోయారు’’ అని ఆయన వివరించారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోందన్నారు.