ఆ ప్రాంతాల్లో అతి శీతల గాలులు.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:21 AM
భారత్ లోని చాలా రాష్ట్రాల్లో అతి శీతల గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లను దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు వివరించింది. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో అత్యల్పంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీ: భారత్ లోని చాలా రాష్ట్రాల్లో అతి శీతల గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లను దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు వివరించింది. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో అత్యల్పంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, అస్సాం మధ్య ప్రాంతాలలో మధ్యస్థం నుండి దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. ఢిల్లీలో ఇవాళ ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పంజాబ్, రాజస్థాన్, హర్యానా, యూపీలో చలి తీవ్రత పెరిగింది. చలి, పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల్లో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సర్వీసులు రద్దయ్యాయి.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా భయాలు పెరుగుతున్న వేళ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై అలసత్వం ప్రదర్శించవద్దని.. వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు చెప్పారు.